జూనియర్‌ క్రికెట్‌లో సన్‌ఆఫ్‌ ద్రావిడ్‌ హీరో!

Dravid son
Dravid’s son

హైదరాబాద్‌: భారత్‌ మాజీకెప్టెన్‌ రాహుల్‌ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ద్రవిడ్‌ మరోసారి డబుల్‌ సెంచరీ తో చెలరేగాడు. జూనియర్‌క్రికెట్‌లో గత ఏడాది డిసెంబరులో ఓ ద్విశతకం బాదినసమిత్‌ తాజాగా అండర్‌-14 బిటిఆర్‌షీల్డ్‌మ్యాచ్‌లో డబుల్‌సెంచరీ నమోదుచేసాడు. బ్యాట్‌తోనేకాదు బౌలింగ్‌లోనూ సత్తాచాటిన ఈ చిచ్చరపిడుగు రెండు వికెట్లు పడగొట్టి ఒంటిచేత్తో ఆతని టీమ్‌కి విజయాన్ని అందించాడు. మాల్యా అదితి ఇంటర్నేషనల్‌స్కూల్‌ తరపున బరిలోకి దిగిన సమిత్‌ ద్రవిడ్‌ 33 ఫోర్లసాయంతో 204 పరుగులుచేసాడు. దీనితోమాల్యా టీమ్‌మూడు వికెట్లనష్టానికి 377 పరుగులభారీస్కోరు నమోదుచేసింది. అనంతరం ఛేదనలో తడబడిన శ్రీకుమారన్‌టీమ్‌ పేలవంగా 110 పరుగులకే ఆల్‌ఔట్‌ అయింది. బౌలింగ్‌లోసమిత్‌ద్రవిడ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. దీనితో ఏకంగా 267 పరుగుల తేడాతోమాల్యా టీమ్‌ విజయాన్ని అందుకుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/