ప్రయాణికులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు

హైదరాబాద్ మహానగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయబోతున్నాయి. నిజాం కాలం‌లో ప్రారంభ‌మైన డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు కాల‌క్ర‌మేణా క‌నుమరుగై పోయాయి. సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబ‌ర్‌తో న‌డిచేవి ఈ బస్సులు నడిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జ‌ల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగ‌ర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు నగర రోడ్లపై పరుగులు పెట్టిన ఈ బస్సులు ఆ తర్వాత ఒక్కొక్కటిగా మాయమయ్యాయి.

నిర్వహణ భారం కారణంగా ఆర్టీసీ వీటిని ఒక్కొక్కటిగా సర్వీసు నుంచి తప్పించింది. దీంతో డబుల్ డెక్కర్ బస్సులు చరిత్ర పుటల్లోకి చేరాయి. మళ్లీ ఇన్నాళ్లకు వీటిని తిరిగి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది 10 డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వంతెనలు, ఆటంకాలు లేని రూట్లలో వీటిని నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.