రేపు తెరాస మహాధర్నా లో పాల్గొనబోతున్న కేసీఆర్

వరి కొనుగోలు విషయంలో కేంద్రం ఫై ఒత్తిడి తెచ్చేందుకు తెరాస ప్రభుత్వం రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో మహా ధర్నా కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్నా లో మంత్రులు , ఎమ్మెల్యే లు , తెరాస కార్య కర్తలే కాదు సీఎం కేసీఆర్ సైతం పాల్గొనబోతున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. అధికారంలో ఉన్న …ప్రతి పక్షంలో ఉన్న టిఆర్ఎస్ ప్రజల వైపే ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి అన్యాయం జరిగితే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే నిరసన వ్యక్తం చేశామన్నారు. పంజాబ్‌లో ధాన్యం కొను గోలు చేస్తారు.. తెలంగాణలో ఎందుకు కొనరంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటుందన్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. ప్రజాస్వామ్య యుతంగా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. టీఆర్ఎస్ ఎల్లప్పుడు రైతుల పక్షాపాతి అని హరీష్‌ పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరగడం కోసమే ఈ ధర్నా నిర్వహి స్తున్నామన్నారు. కేంద్రం అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలని వెల్లడించారు.