ఖైరతాబాద్ లో విగ్రహ నిర్మాణం మొదలు

భారీ గణపతి స్థానంలో చిన్న విగ్రహం

Khairatabad Ganesh
Khairatabad Ganesh

హైదరాబాద్‌: ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ భారీ గణపతి స్థానంలో ఆరు అడుగుల వినాయక విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం వినాయకుడు ‘ధన్వంత్రి నారాయణ మహా గణపతి’ ఆకృతిలో కొలువుదీరనున్నాడని ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ సింగరి సుదర్శన్ వ్యాఖ్యానించారు. విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే తయారు చేయనున్నామని ఆయన అన్నారు. విగ్రహ నిర్మాణం పనులు ఈరోజు ఉదయం 11 గంటలకు మొదలవుతాయని, వినాయక చవితికి రెండురోజుల ముందే పనులు పూర్తవుతాయని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/