ట్రంప్‌, మోడి రోడ్‌ షో..ఆధార్ కార్డు తప్పనిసరి!

modi-trump
modi-trump

గుజరాత్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈనెల 24న భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోడి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు రానున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి గాంధీ ఆశ్రమం వరకూ వీరి రోడ్‌ షో జరగనుంది. ఈ సందర్భంగా రోడ్డుపై నిలుచుని, అ్లంతా దూరాన ఉన్న ట్రంప్‌ను చూడానుకుంటే ముందుగా పోలీసుకు ఆధార్‌ కార్డు చూపించాల్సి ఉంటుంది. అప్పుడే ట్రంప్‌ను చూసేందుకు ఎవరికైనా అనుమతి భిస్తుంది. పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం.. ట్రంప్‌, ప్రధాని రోడ్‌ షోను వీక్షించాలనుకునేవారు తమ ఆధార్‌ కార్డు జెరాక్స్‌ కాపీని, ఫోను నంబరును పోలీసులకు తెలియజేయాలి. ఆ తరువాత వారికి ఒక ఐడీ కార్డు అందజేస్తారు. దీని ఆధారంగానే రోడ్‌ షోలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ విషయాన్ని కలెక్ట్‌ కార్యాయం వద్దనున్న నోటీసు బోర్డుపై లిఖించారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/