అమెరికా అధ్యక్ష రేసు..మూడో ఎన్నికలోనూ ట్రంప్ విజయం

Donald Trump wins Nevada Republican caucuses, moves closer to clenching party nomination

వాషింగ్టన్ః అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రెండు ఎన్నికల్లో ట్రంప్ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడో ఎలక్షన్​లోనూ ఘన విజయం సాధించారు. గురువారం రోజున వర్జిన్​ ఐలాండ్స్​లో జరిగిన ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్​ 73 శాతం ఓట్లు సాధించి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి నిక్కి హేలీకి కేవలం 26 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాలపై ప్రస్తుతం పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్​ హర్షం వ్యక్తం చేశారు. అందరికి ధన్యావాదాలు తెలిపారు. తాము ఘన విజయం సాధించామని, వాస్తవానికి తాము గెలుస్తామని ముందే ఊహించామని అన్నారు. కానీ ఇంత భారీ మెజారిటీతో గెలుస్తామని మాత్రం అనుకోలేదని సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా ప్రజలు అందించిన ఈ విజయాన్ని ఎప్పుడూ మరిచిపోనని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, గురువారం జరిగిన వర్జినియా ఎన్నికల్లో అధికారులు నిబంధనలు పాటించలేదని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనుమతించిన దాని కంటే ముందుగానే పోటీని నిర్వహించారని సమాచారం.