హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

షోరూంలో వ్యాపించిన మంటలు.. 7 కార్లు దగ్ధం

Fire accident in car showroom at hyderabad
Fire accident in car showroom at hyderabad

హైదరాబాద్: నగరంలోని ఓ కార్ షోరూంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అర్ధరాత్రి దాటాక జరిగిన అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. హైదరాబాద్, ముషీరాబాద్‌ గోల్కొండ క్రాస్‌రోడ్స్‌లోని షోరూంలో చోటు చేసుకున్న ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. ప్రాథమిక సమాచారం మేరకు ఏడు కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నికీలలు ఎగసిపడడంతోపాటు పెద్దపెద్ద శబ్దాలు వినిపించడంతో చుట్టుపక్కల నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. పైగా ఘటనా స్థలిని ఆనుకుని ఎల్‌పీజీ షోరూం ఉండడంతో పేలుళ్ల ధాటికి భయపడిన చుట్టుపక్కల ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ నివాసితులు బయటకు పరుగు తీశారు. అయితే స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నానా తంటాలు పది మంటలను అదుపు చేశారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/