జూన్ నుంచి డొమెస్టిక్ విమాన ఛార్జీలు పెంపు

భారత విమానయాన శాఖ ప్రకటన

Domestic air fares Increase from June
Increase in air fares

వచ్చే నెల నుంచి డొమెస్టిక్ విమాన ఛార్జీలు పెరుగుతున్నాయి. దేశీయ ప్రయాణాలకు సంబంధించి లోయర్ లిమిట్‌ను 15 శాతం పెంచుతున్నట్టు భారత విమానయాన శాఖ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో, ప్రయాణికుల విమానాల్లో ప్రయాణం తగ్గిందని.. దీని వల్ల విమానయాన సంస్థలకు నష్టాలు వస్తున్నాయని చెప్పింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ పరిస్థితిని మరింత దిగజార్చిందని తెలిపింది.

ఎయిర్ లైన్స్ సంస్థలను కష్టాల నుంచి గట్టెక్కించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. 40 నిమిషాల కంటే తక్కువ ప్రయాణ సమయం ఉండే ప్రయాణాల ఛార్జీలను 13 శాతం రూ. 2,300 నుంచి రూ. 2,600కి పెంచుతున్నట్టు విమానయాన శాఖ తెలిపింది.ఈ ప్రయాణాలకు గరిష్ఠ ధర మాత్రం రూ. 7,800కు మించకూడదని చెప్పింది. 40 నిమిషాల నుంచి 60 నిమిషాల ప్రయాణాల ఛార్జీని రూ. 2,900 నుంచి రూ. 3,300కు పెంచినట్టు తెలిపింది. గరిష్ఠ ఛార్జీ రూ. 9,800కు మించకూడదని పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/