మండుతున్న రసాయనాల నౌక… ఆమ్లవర్షాలు పడే అవకాశం

శ్రీలంక మెరైన్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడి

MV ‘Express-Pearl’ ship burning
MV ‘Express-Pearl’ ship burning

ఎంవీ ‘ఎక్స్-ప్రెస్ పెరల్’ నౌకలో ప్రమాద రసాయనాలు మండటం వల్ల ఆమ్ల వర్షం కురిసే అవకాశం ఉందని శ్రీలంక మెరైన్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ (ఎంఈపీఏ) పేర్కొంది. దీని నుంచి నైట్రోజన్ డయాక్సైడ్ భారీగా వాతావరణంలోకి కలిసి పోయినట్టు గుర్తించినట్లు తెలిపింది. ఇది వర్షాకాలం కాబట్టి స్వల్పంగా ఆమ్ల వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. వర్షాల్లో తడవకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. కాగా , ఎంవీ ‘ఎక్స్-ప్రెస్ పెరల్’ నౌక గుజరాత్ నుంచి కొలంబోకు రసాయనాలు, ముడి సరుకులను తీసుకెళ్తుండగా, కొలంబో పోర్టు సమీపంలో నిలిపారు. మే 20న ఈ నౌక అగ్నిప్రమాదానికి గురైంది. దీని ట్యాంకుల్లో 325 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్‌తోపాటు ప్రమాదకరమైన 25 టన్నుల నైట్రిక్ యాసిడ్ కూడా ఉంది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/