ప్రకాశంజిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌

పలువురు ఐఏఎస్‌ లకు బదిలీ, పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

Praveen Kumar IAS
Praveen Kumar IAS

Amaravati: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులకు బదిలీ, పోస్టింగులు ఇస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి . ఏపీ టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్‌ ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్న ఐఏఎస్‌ అధికారి ఎస్‌ సత్యనారాయణను ఏపీ టూరిజం ఎండీగా నియమించారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న పి బసంత్‌కుమార్‌ను మున్సిపల్‌ శాఖలో ఎంఐజీ ప్రాజెక్ట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించి, ఏపీ యూఎఫ్ ఐడీసీ ఎండి గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, ఇప్పటిదాకా ఉన్న ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేసి, సాంకేతిక విద్య డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/