రాజీనామా పై పలు విషయాలు తెలిపిన డొక్కా

పలు విషయాల్లో పార్టీ ఆలోచన ఒకలా, నా ఆలోచన మరోలా ఉంది

Dokka Manikyavaraprasad
Dokka Manikyavaraprasad

గుంటూరు: నేడు గాంధీజీ వర్ధంతి సందర్భంగా టిడిపి మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ గుంటూరు హిమని సెంటర్‌లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొక్కా మీడియాతో మాట్లాడుతూ… తన రాజీనామా చేసిన విషయంపై పలు విషయాలు తెలిపారు. తన వ్యక్తిగత ఆలోచనల మేరకే రాజీనామా చేశానని అన్నారు. శానసమండలి రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని తెలిపారు. పలు విషయాల్లో తమ పార్టీ ఆలోచన ఒకలా ఉందని, తన ఆలోచన మరోలా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను దూరంగా ఉండడమే మంచిదనిపించిందని వివరించారు. అందుకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. కాగా ఇటివల డొక్కా మాణిక్యవరప్రసాద్‌ టిడిపి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/