విజయ్ దేవరకొండ ‘ఖుషి’ లో మజిలీ హీరోయిన్

విజయ్ దేవరకొండ – సమంత జంటగా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న లవర్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. గతంలో పవన్ – భూమిక కలయికలో వచ్చిన ఖుషి చిత్ర టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం, విజయ్ – సామ్ జంటగా నటిస్తుండడం తో ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లే సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ శివ.

కాగా ఈ మూవీ లో మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఓ కీలక రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. మజిలీ సినిమాతో టాలీవుడ్​కు పరిచయమైన దివ్యాంశ కౌశిక్ ఆ మూవీలో తన నటనకు మంచి మార్కులే కొట్టేసింది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా హిట్ అయినా ఈ భామకు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. మజిలీ తర్వాత రామారావు ఆన్​ డ్యూటీ, మైఖేల్ సినిమాల్లో సందడి చేసింది. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో ఈ భామకు ఖుషి ఛాన్స్ రావడం అభిమానులను సంతోషానికి గురి చేస్తుంది. ఈ సినిమాలో దివ్యాంశ.. సమంతకు సోదరి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పాత్రపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.