కార్మికులకు,ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ

మంత్రి గంగుల కమలాకర్ హాజరు

Distribution of essential goods

Karimnagar: కరీంనగర్ లో మూడు వేల మంది కార్మికులకు,ఆటో డ్రైవర్లకు మంత్రి గంగుల కమలాకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. దాతల నుంచి వచ్చిన రూ.15లక్షల సాయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

ప్రభుత్వం లాక్ డౌన్ పొడగించిన నేపథ్యంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

  ప్రజా సహకారంతో కరోనాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం  చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/