భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
TS CM Kcr
న్యూఢిల్లీ : సీఎం కెసిఆర్ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల అధికారులతో సీఎం సమీక్షించి పలు సూచనలు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, 24 గంటలూ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
కాగా, ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షేకవత్‌తో భేటీ అయ్యారు. నేడు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/