ఆసుపత్రి లో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్

tamil-nadu-cm-stalin-nirnay

కరోనా తో బాధపడుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆసుపత్రి లో చేరారు. స్టాలిన్ కు జలుబు, జ్వరం ఇతర లక్షణాలు ఉండటంతో మంగళవారమే టెస్టు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి ఆయన నివాసంలోనే ఉండి చికిత్స తీసుకుంటూ వచ్చారు. తనకు కరోనా సోకినా విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని , మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని కోరారు. అయితే కరోనా లక్షణాలు పెరగడంతో ఆయనకు పలు వైద్య పరీక్షలు చేసేందుకు, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు గురువారం ఆస్పత్రికి తరలించారు. అయితే వైరస్ లక్షణాలు తీవ్రం కావడంతో ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్నారు.

కరోనా లక్షణాలపై వైద్య పరీక్షలు, అబ్జర్వేషన్ నిమిత్తం స్టాలిన్ చెన్నైలోని ఆళ్వార్ పేటలో ఉన్న కౌవరీ ఆస్పత్రిలో చేరినట్టు ఆ ఆస్పత్రి యాజమాన్యం గురువారం ప్రకటించింది. స్టాలిన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బుధవారమే స్టాలిన్ కు ఓ లేఖ రాశారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కూడా సీఎం స్టాలిన్ వేగంగా కోలుకుని, తిరిగి ప్రజా సేవలో అంకితం కావాలని ఆశిస్తున్నట్టు ప్రకటించారు.