కర్నూలు జిల్లాలో అతిసార: ముగ్గురు మృతి

కలుషిత నీటి సరఫరానే కారణమంటున్న గ్రామస్తులు

Diarrhea in Kurnool district: Three killed
Diarrhea in Kurnool district: Three killed

Kurnool District: క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రాతో గ్రామాల ప్ర‌జ‌లు అతిసార బారిన పడిన సంఘటన కర్నూలు జిల్లా లో జరిగింది ఇప్ప‌టికే ముగ్గురు మృతి చెందారు. మరికొంత మంది చికిత్స పొందుతున్నారు.. ఆదోనిలో దేవర ఉత్సవాల్లో కలుషిత నీరు తాగి 30 మంది అతిసార‌కు లోనయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందారు. అస్వస్థతకు గురయిన వారందరినీ వెంటనే ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. పాణ్యం మండలం గోరుకల్లు లో అతిసార కు గురై ఇద్దరు మృతి చెందారు. కలుషిత నీరు సరఫరా కావడం వల్లే వీరు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/