ఆదిపురుష్ టీజర్‌ ట్రోలింగ్‌ ఫై డైరెక్టర్ ఓం రౌత్‌ స్పందన

ఆదిపురుష్ టీజర్ ట్రోలింగ్ ఫై డైరెక్టర్ ఓం రౌత్‌ స్పందించారు. బాహుబలి , సాహో , రాధే శ్యామ్ చిత్రాలతో నార్త్ లోను సత్తా చాటిన ప్రభాస్..ఇప్పుడు ఆదిపురుష్ అంటూ రామాయణ కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రభాస్, కృతి సనన్ జంటగా టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లుక్స్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. ఇక ఆదివారం విడుదలైన టీజర్ ఒక్కసారిగా సినిమాను విమర్శల పాలుచేసింది. టీజర్ చూస్తుంటే కార్టున్ వీడియో చూసినట్లు ఉందని ప్రభాస్ అభిమానులు సైతం విమర్శలు చేస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీ నేతలు సైతం టీజర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేయడం, “బాయ్​కాట్ ఆదిపురుష్​” నినాదం అందుకోవోడం తో దర్శకుడు ఓం రౌత్ దీనిపై స్పందించారు.

‘‘ఆది పురుష్‌’ టీజర్‌ విడుదలైన తర్వాత వస్తున్న ట్రోలింగ్‌ చూసి నేను కాస్త ధైర్యం కోల్పోయిన మాట వాస్తవం. అయితే, ట్రోలింగ్‌ వల్ల నేనేమీ పూర్తిగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సినిమా వెండితెర కోసం తీశాం. థియేటర్‌లో తెరసైజు తగ్గచ్చేమో కానీ, ఆ పరిమాణాన్ని మరీ మొబైల్‌కు తగ్గించకూడదు. అలా చేస్తే, అస్సలు బాగోదు. నాకు అవకాశం ఇస్తే, యూట్యూబ్‌లో పెట్టకుండా చేయొచ్చు. నాకు అది కేవలం ఓ గంట పని. కానీ, అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతోనూ యూట్యూబ్‌ ఆడియెన్స్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అని అన్నారు.