ఏపిలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు

విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు 88..మొత్తం మృతుల సంఖ్య 73

Corona-cases-in-Andhra-Pradesh
Corona-cases-in-Andhra-Pradesh

అమరావతి: ఏపిలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం తాజాగా బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో మొత్తం 9,831 నమూనాలు పరీక్షించగా .. కొత్తగా 138 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 50, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 84 మందికి, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఏపిలో కొత్తగా ఇద్దరు మరణించినట్లు పేర్కొంది. ఈ రెండు కరోనా మరణాలు కృష్ణా జిల్లాలో నమోదైనట్లు తెలిపింది. శుక్రవారం కరోనా నుంచి కోలుకున్న 21 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ప్రకటించింది. ఏపిలో కరోనా మరణాల సంఖ్య 73కు చేరింది. కొత్తగా.. నమోదైన కరోనా కేసులతో కలిపి ఏపి లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,250కి చేరింది. ఇప్పటివరకూ 2294 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/