కొడుకును చూస్తూ ఖుషి అవుతున్న దిల్ రాజు

ప్రముఖ నిర్మాత , డిస్ట్రబ్యూటర్ దిల్ రాజు మరోసారి తండ్రి పోస్ట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య తేజస్విని మగ బిడ్డకు జన్మించింది. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడు వచ్చాడంటూ చిత్ర ప్రముఖులతో పాటు , సినీ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక రాజు గారి ఆనందం మాములుగా లేదు. వారసుడు జన్మించడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే దిల్ రాజు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయిన తన కొడుకును ఎత్తుకొని బాక్సాఫీస్ హిట్ వచ్చినంత ఆనందంగా స్మైల్ ఇచ్చారు. హాస్పిటల్ బెడ్ పై రాజు గారి భార్య తండ్రి కొడుకులను చూసి ఎంతో సంతోషంలో మునిగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇక వీరి ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రేండింగా మారిపోయింది.

ఆయన మొదటి భార్య అనిత 2017 సంవత్సరం లో అనారోగ్యంతో మరణించింది. అప్పటికే దిల్ రాజు కు కూతురు హర్షిత రెడ్డి ఉండగా.. ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాత అయిన దిల్ రాజు..భార్య మరణం తర్వాత కొన్ని నెలల పాటు ఒంటరిగా ఉంటూ వచ్చాడు. ఆ తర్వాత 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో దిల్ రాజు, తేజస్విని రెండో వివాహం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి తండ్రయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. శంకర్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.