మీడియా లో హైలైట్ కావడం కోసం రేవంత్ ఫై జగ్గారెడ్డి కామెంట్స్ చేసాడట..

jagga reddy

రెండు రోజులుగా మీడియా లో జగ్గారెడ్డి పేరు మారుమోగిపోతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం రేవంత్ ఫై ఆయన చేసిన కామెంట్స్ తో పాటు..సోమవారం సాయంత్రం సంచలన ప్రకటన చేస్తానని చెప్పడం. దీంతో మీడియా లో జగ్గారెడ్డి పేరు వైరల్ గా మారింది. అయితే సాయంత్రం ఏ ప్రకటన చేస్తారా..అని మీడియాతో పాటు కాంగ్రెస్ నేతలు , కార్య కర్తలు , ఇతరపార్టీ నేతలు ఆసక్తి గా ఎదురుచూడడం మొదలుపెట్టారు.

అయితే జగ్గారెడ్డి మాత్రం ఇదో రాజకీయాల్లో ఎత్తుగడ అని చెప్పుకొచ్చారు. బీజేపీ కార్యవర్గ సమావేశం గురించి గంటలు గంటలు చూపిచ్చిండ్రు. మధ్యలో కేసీఆర్ జొర్రిండు. మీరేం జేసిండ్రూ (మీడియాను ఉద్దేశించి)..? బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మొదలుపెడితే.. యశ్వంత్ సిన్హా ర్యాలీలు, కేసీఆర్ స్పీచ్ 3 గంటలపాటు అదే చూపిచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీగా ప్రజల కోసం మేం ఇంత పనిచేస్తున్నా మమ్మల్ని చూపెట్టలేదు’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

‘రాజకీయాల్లో ఎత్తులు, ఎత్తుగడలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ ఎత్తు ఏస్తే.. మరొకడు మరో ఎత్తుగడ వేస్తడు. ఇంకొకడు పైఎత్తుగడ వేస్తడు. బీజేపీ ఓ ఎత్తుగడ వేస్తే.. టీఆర్‌ఎస్ ఇంకో ఎత్తుగడ వేసింది. కాంగ్రెస్ పైఎత్తుగడ వేసింది’ అంటూ జగ్గారెడ్డి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి స్టార్ట్ చేసిన కాణ్నుంచి, మీడియాలో ఇక మాదే చూపెడుతుండ్రు. నేను ఛానల్ ఒత్తుకుంట కూసున్న. ఇదొక ఎత్తుగడే కదా. మీడియాలో మూడో ప్లేస్ మేం తీసుకున్నమా; లేదా?’ అని జగ్గారెడ్డి తెలిపారు.