వకీల్ సాబ్ డైరెక్టర్‌ను పట్టించుకోని దిల్ రాజు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీ వకీల్ సాబ్ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడని ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ తనదైన శైలిలో తెరకెక్కించి పవన్‌కు అదిరిపోయే సూపర్ హిట్‌ను అందించాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా నిర్మాత దిల్ రాజుకు అద్భుతమైన కలెక్షన్లు తెచ్చిపెట్టింది.

దీంతో దిల్ రాజు ఈ సినిమాతో ఇంత భారీ సక్సె్స్ అందించిన దర్శకుడు వేణు శ్రీరామ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని అందరూ అనుకున్నారు. ఇటీవల సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తున్న డైరెక్టర్స్‌కు చిత్ర హీరోలు గాని, నిర్మాత గాని ఏదో ఒక గిఫ్టు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రీసెంట్‌గా వచ్చిన ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానాకు కూడా ఆ చిత్ర నిర్మాతలు ఓ బెంజ్ కారును గిఫ్టుగా ఇచ్చారు. దీంతో ఇప్పుడు వేణు శ్రీరామ్‌కు కూడా దిల్ రాజు గిఫ్ట్ ఇస్తాడని అందరూ అనుకున్నారు.

కానీ దిల్ రాజు మాత్రం వేణు శ్రీరామ్‌కు ఎలాంటి బహుమతిని అందించలేదు. దీంతో దిల్ రాజు వేణు శ్రీరామ్‌ను పట్టించుకోవడం లేదనే వాదన సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేగాక దర్శకులకు బహుమతులు అందించే ఆనవాయితీకి దిల్ రాజు ఫుల్ స్టాప్ పెట్టాడనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.