‘నివర్’ ఉధృతికి నీటిపాలు !
ఎడతెరపిలేని వర్షం-నేలవాలిన వరి
వరికి వర్షం తెచ్చిన తంటా
కష్టాల కడలిలో రైతులు
పంటలకు భారీనష్టం

గుంటూరు : నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రైతు జీవనం అస్తవ్యస్థ:గా మారింది.. గురువారం తెల్లవారుజామునుంచి ఎడతెరపిలేకుండా పడుతున్న వర్షం ధాటితో గుంటూరు కృష్ణాడెల్టాలో వరిపంటకు భారీ నష్టం వాటిల్లింది..
పంటచేతికి వచ్చే దశలో నివర్ వర్షం సృష్టించిన బీభత్సానికి రైతులు కుదేలయ్యారు.
గుంటూరుజిల్లాలో డిసెంబర్ మొదటివారంలో ముందుస్తుగా వేసిన వరిపంట కోతలు కోయాలని రైతులు భావిస్తున్న తరుణంలో వర్షం వచ్చి రైతుల వెన్ను విరిచింది..
పండిన వరి కంకులు నిగనిగలాడుతూ రైతులను ఆనంద పరవవులను చేస్తున్న తరుణంలో వర్షం అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది..
మేలిమి రంగులో నిగనిగలాడుతున్న వరికంకులు వర్షానికి తడిసి ముద్దగా మారి, పంట బరువెక్కి నేలవాలింది..

నివర్ తుఫాన్ గురువారం తెల్లవారుజామున తమిళనాడు వద్ద తీరం దాటటంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది..
ఈ వర్షం చేతికి అందివచ్చిన మాగాణి వరి, పత్తి వంటి వాణిజ్య పంటలన తీవ్రంగా దెబ్బతీసింది.. గుంటూరుజిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ లో దాదాపు 1.50 లక్షల హెక్టార్లలో రైతులు వరిపంటను సాగుచేశారు.
పంట పిందె దశలో కొన్ని అనూహ్య వాతావరణ పరిస్థితులు ఏర్పడి దోమ, పురుగుల ధాటికి రైతులు విలవిలలాడారు..
దీనివల్ల రైతులు ఎకరాకు రూ.15వేలకు పైగా అదనపు ఖర్చలు పెట్టాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ఈఏడాది కాలం కలిసి రాక ప్రతికూల పరిస్థితులు దాపురించి ఖర్చులు రెండింతలు పెరిగాయని రైతులు బాధపడుతున్నారు.
ఇదిలా ఉండగా ఎంత ఖర్చు పెట్టినా మరో 10 రోజుల్లో వరికోతలు ప్రారంభించాలని రైతులు భావిస్తున్న తరుణంలో వర్షం భారీ తంటాలన తెచ్చిందని రైతులు తీవ్రంగా కలత చెందుతున్నారు.
ఇదిలా ఉండగా, వర్షానికి నేలవాలిన వరిపంటను రైతులు కాపాడుకోవాలంటే తంటాలు పడాల్సిందే.
గురువారం అర్ధరాత్రి వరకు కురిసిన వర్షానికి కొన్నిచోట్ల వరిచేలు వాలి కంకులపై నీరు పారే పరిస్థితి ఏర్పడింది..
నేలవాలిన వరిని పైకి తీసి తలలు కుటుంటే రైతులకు ఖర్చు తలకు మించిన భారంగా మారింది..
తలలు కట్టుకోవాలంటే ఎకరాకు దాదాపు రూ.10వేలు అదనపు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఖర్చుసంగతి అలా ఉంచితే, ధాన్యం రంగు మారుతుందని చెబుతున్నారు..
కాస్త లేటుగా వరి నాట్లు వేసిన పొలాల్లో అక్కడక్కడా గింజలు పాలుపోసుకుని గట్టిబడుతున్నాయి. ఇలాంటి తరుణంలో వర్షం రావటంతో గింజలు బూజుపడతాయని రైతులు చెబుతున్నారు..
వర్షం తగ్గిన తర్వాత వరిపంట పొలాల్లో తడి కంకులను తలలు గట్టే పనులు చేయాల్సి ఉందని, అయితే ఇంకా వర్షం పడుతుండటం వల్ల ఇపుడు చేయలేమని రైతులు అంటున్నారు.
జిల్లాలోని కృష్ణాడెల్టా ప్రాంతంలో వరి రైతులు బాగా దెబ్బతిన్నారు.. డెల్టాలో దాదాపు 1.66 లక్షల హెక్టార్లలో ఈ ఏడాది వరి సాగైంది..

ఇప్పటికే దోమ, పురుగులు వంరిపంటను ఆశించి ముందెన్నడూ లేని విధంగా ఎకరానికిన రూ.20వేలకు పైగా అదనపు ఖర్చు చేశారు..
నివర్ వర్షం ధాటికి పంటను ప్రస్తుతం ఉన్న దశలో పంటను కాపాడుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సిందేనని రైతులు అంటున్నారు..
ధాన్యం ఇంటికి చేరిన తర్వాత వీటిని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చేరేసరికి ధాన్యం రంగుమారుతుందని ధరకు కొర్రి వేసే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో నివర్ తుఫాన్ వల్ల వరితోపాటు వాణిజ్య పంటలకు దాదాపు రూ.75నుంచి రూ.100 కోట్ల మేర పంటనష్టం వాటిల్లుతుందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/