తెలుగు ఇండస్ట్రీ ప్రాణసమానం

-నటి పూజాహెగ్డే వివరణ

Pooja Hegde
Pooja Hegde

కొద్ది రోజుల క్రితం హీరోయిన్‌ పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి..

ఈ విషయం మరింత సీరియస్‌ అవ్వకూడదనే ఉద్దేశ్యంతోఆమె స్వయంగా తెలుగులో ఒక పోస్ట్‌షేర్‌ చేశారు.. ‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారు. అక్షరాన్ని మార్చగలరేమో అభిమానాన్ని కాదు..

నాకు ఎప్పటికీ తెలుగు చిత్రపరిశ్రమ ప్రాణసమానం..

ఇది నా చిత్రాలను అభిమానించే వారికి నా అభిమానులకూ తెలిసినా.. ఎటువంటి అపార్ధాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నా. నా కెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడిఉంటాను.. అంటూ పేర్కొంది..

పూజా హెగ్డే తన ఇంటర్వ్యూను పూర్తిగా చూడమని, వేరే విషయంలో తను ఆ మాటలు అన్నాను..అంటూ చెప్పటం జరిగింది..

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/