మా ఎలక్షన్స్ : ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పిన జీవిత

మా ఎలక్షన్స్ తేదీ దగ్గర పడుతుండడంతో వార్ మరింత పెరుగుతుంది. ఓ పక్క ఇరు ప్యానల్ సభ్యుల కామెంట్స్ ..మరోపక్క మద్దతు దారుల కామెంట్స్ తో మీడియా లో హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యురాలు జీవిత రాజశేఖర్..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పింది. రీసెంట్ గా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ఇటీవల తారక్ ని కలిశాను. నాకు ఓటేయాల్సిందిగా కోరాను. కానీ అతడు ఆసక్తిగా లేనని అన్నారు. అసోసియేషన్ లో జరుగుతున్న వివాదాల గురించి ఆయన చర్చించారు. ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆయన నిరాసక్తత వ్యక్తం చేసారు అని జీవిత మీడియాతో తెలిపింది.

ఈమె మాటల విన్న చాలామంది ఓటు వేయనన్న ఎన్టీఆర్ పద్ధతి సరికాదు అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ క్రమంలో జీవిత తన మాటలను వెనక్కి తీసుకుని ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పింది. ఎన్టీఆర్ గురించి ఆమె చేసిన ప్రకటన తప్పుదోవ పట్టిస్తుందని ఆమె అంగీకరించింది. జీవిత మాట్లాడుతూ-ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. అతను నాతో మామూలుగా మాట్లాడుతూ అలా చెప్పాడు. నేను దానిని ఎత్తి చూపాల్సింది కాదు. ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది.. అంటూ పశ్చాత్తాపం చెందారు.