రాళ్లు విసిరినట్లు ఆధారాలు లభించలేదు: డీఐజీ క్రాంతి రాణా

దాడి జరిగిందని టీడీపీ నేతలు ఫిర్యాదుపై కేసు నమోదు

Tirupati: తిరుపతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు ఆటంకం కలిగించాలని, దుండగులు వచ్చి రాళ్లు విసిరినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని డీఐజీ క్రాంతి రాణా తెలిపారు. అయితే రాళ్ల దాడి జరిగిందని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని వెల్లడించారు.

కాగా గాయాలైన ఇద్దరు వ్యక్తులను విచారించామని, వారిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశామని తెలిపారు. సీసీ, మొబైల్, మీడియా ఫుటేజ్‌లను కూడా పరిశీలించామని, చంద్రబాబు సభకు ఎలాంటి ఆటంకం కలుగకుండా జరిగిందని, సభ అయిపోయిన తర్వాత చంద్రబాబు వైపు రాళ్లు విసిరినట్లు తమకు ఫిర్యాదు అందిందని డీఐజీ వెల్లడించారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/