మోతెరా స్టేడియానికి ట్రంప్

YouTube video


అహ్మదాబాద్‌: ట్రంప్‌ దంపతులు మోడితోపాటు ఆశ్రమంలో నేలపై కూర్చున్నారు. కాసేపు ముగ్గురూ కలిసి నేలపై కూర్చొని మాట్లాడుకున్నారు. ఆశ్రమ విశిష్టతను వారికి మోడి వివరించి చెప్పారు. ఆశ్రమాన్నంతటినీ చూపెడూ వారితో గడిపారు. ఆశ్రమం సందర్శకుల పుస్తకంలో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆ తర్వాత అందులో మెలానియా కూడా సంతకం చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని మోడితో పాటు ట్రంప్ దంపతులు మొతెరా స్టేడియానికి బయలుదేరారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/