ఆవిరైన షాహీన్‌బాగ్‌ ఆందోళన!

పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళన

Dharna in Shaheen Bagh area (File)

ఏదిఏమైతేనేమి షాహీన్‌బాగ్‌ ఆందోళన కళతప్పింది. దేశవ్యాప్తంగా విఫలమైంది. ఆ ఉద్యమ నాయకులు అభాసుపాలయ్యారు. సిఎఎ అమలు అవుతున్నది ఆ చట్టం ప్రకారం అనేక మంది పౌరసత్వం అందుకున్నారు.

మీడియా ద్వారా ఆ విషయం దేశ ప్రజలు తెలుసుకున్నారు. మరి షాహీన్‌బాగ్‌ ఉద్యమం నిర్వీర్యమైనట్టేకదా? నిజాయితీలేని ఆందోళనగా చరిత్రలో నిలిచిపోయినట్టేకదా?

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలో రెండు నెలలకుపైగా కొనసాగుతున్న ధర్నా ప్రదర్శన కళావిహీనంగా మారింది.

ఒకప్పుడు వందలు,వేల మంది కనిపించిన చోట ఇప్పుడు పదుల సంఖ్యలో ముస్లింమహిళలు టెంట్‌ లో కనిపిస్తున్నారు.

సిఎఎ, ఎన్‌ ఆర్‌సిని వెనక్కి తీసుకునేంతవరకు ధర్నా నుంచి వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పిన మహిళలిప్పుడు కనిపించడం లేదు. రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

టెంట్‌లోని నిశ్శబ్దం తాండవి స్తోంది. నినాదాల హోరు కరవైంది. మైకులు మూగపోయాయి. నాయకుల రాక అసలే లేదు. ఆజాదీ.. నినాదాలు వినిపించడం లేదు.

సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తి న్యాయవాదులు పలకరించినా వారి మాటలను పెడచెవిన పెట్టి, వారి సూచన లను వినేందుకు సైతం నిరాకరించి ఆందోళన బాటలో నినాదాల జోరుతో ఉర్రూతలూగిన మహిళలు ఇప్పుడు కనిపించకుండా పోయారు.

ఢిల్లీ దగ్ధమై 40 మంది మరణించినాక అర్థంలేని వారి ఆగ్రహం పూర్తిగా చల్లారినట్టు కనిపిస్తోంది.

ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ లాంటి అల్లర్లను ఆందోళనలను, ధర్నాలను, నిరసన ప్రదర్శనలను, రోడ్డు దిగ్బంధనాలను దేశంలోని పలుచోట్ల చేపట్టారు. ముంబాయి, భోపాల్‌, లక్నో, నాగ్‌పూర్‌, అలహాబాద్‌, ఇట్లా అనేక నగరాలలో వేసిన టెంట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బురఖాలు ధరించి కూర్చునే మహిళల సంఖ్య బాగా తగ్గింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత పర్యటన కొచ్చిన రోజు అల్లర్లు సృష్టించి కల్లోలం రేపి మీడి యాను ఆకర్షించి దేశ ప్రతిష్టను దిగజార్చాలనుకున్న ఆందోళన కారుల కోరిక కొంతమేర నెరవేరింది. దేశాన్ని ‘బద్‌నామ్‌ చేయాలన్న వారి ఇచ్ఛ పూర్తయింది.

అంతర్జాతీయ మీడియాలో ఢిల్లీ అల్లర్లపై ఏకపక్ష వార్తలు ప్రచురించేలా పన్నిన వ్యూహం విజయవంతమైంది. ముస్లింల ఊచకోత జరిగిందని, వారికి అన్యాయం జరుగుతోందని తప్పుడు వార్తలు రాయించడంలోనూ ఆ శక్తులు విజయం సాధించాయి.

నిఘా అధికారి అంకిత్‌శర్మ 40 కత్తిపోట్లతో మరణించిన సంగతి, ఓ హెడ్‌కానిస్టేబుల్‌ బుల్లెట్‌ గాయాలతో మరణించిన విషయం ఒక డిసిపి తల పగిలి, ఎసిపికి తీవ్ర గాయాలైన సంగతి ఆ మీడియా పట్టించు కోలేదు.అనేక మంది హిందువ్ఞల శవాలు, అమ్మాయిల దుస్తులు మురికి కాలువలో లభ్యమైన సంగతినీ పట్టించుకోలేదు.

అనేక దుకాణాలు, వాహనాలు, ఇళ్లు దగ్ధమై అన్యాయపోయిన హిందు వ్ఞల గూర్చిన ప్రస్తావన అంతర్జాతీయ మీడియాలో కనిపించ లేదు. జాతీయ మీడియాలోనూ కొందరు ముస్లిం పక్షపాత జర్నలిస్టులు, మీడియా అధిపతులు ఏకపక్షంగా ‘రిపోర్టు చేసి వారికి సపోర్టు చేశారు.

ఈ నేపథ్యంలో షాహీన్‌ బాగ్‌ ఖాళీకావ డం చూస్తే వారివాదనలో, ఆందోళనలో, అల్లర్లలో, హత్యల్లో, విధ్వంసంలో ఇసుమంత సత్యంలేదన్న సంగతి బహిర్గతమైంది.

సిముస్లింల మనస్తత్వాన్ని హిందువ్ఞలు అర్థంచేసుకోలేకపోతున్నారని అనేక టీవీ కార్యక్రమాల్లో ఆయన పేర్కొన్నారు.

ఎవరికి నష్టం కలిగించని సిఎఎకు వ్యతిరేకంగా ఇంతటి హింస, విధ్వంసం సృష్టించడం వారి మానసిక స్థితికి అద్దం పడుతుందని ఆయన పదేపదే చెప్పారు.

ఒకప్పుడు వేలమంది మహిళలు కూర్చున్న చోట పట్టుమని పదిమంది లేకపోవడం, టెంట్లు బోసిపోయి కనిపించడం కొన్ని చోట్ల తమను బలవంతంగా బెదిరించి టెంట్లు కిందకు తోలుతున్నారన్న మహిళల ఆరోపణలు . ఏదిఏమైతేనేమి షాహీన్‌బాగ్‌ ఆందోళన కళతప్పింది.

దేశవ్యాప్తంగా విఫలమైంది. ఆ ఉద్యమ నాయకులు అభాసుపాలయ్యారు. సిఎఎ అమలవ్ఞ తోంది.ఆ చట్టం ప్రకారం అనేక మంది పౌరసత్వం అందుకున్నారు.

మీడియా ద్వారా ఆ విషయం దేశ ప్రజలు తెలుసుకున్నా రు. మరి షాహీన్‌బాగ్‌ ఉద్యమం నిర్వీర్యమైనట్టేకదా? నిజాయితీలేని ఆందోళనగా చరిత్రలో నిలిచిపోయినట్టేకదా?

  • ఉప్పల నరసింహం. సీనియర్‌ జర్నలిస్టు

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/