కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్ అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్

బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ థర్డ్ క్లాస్ బ్రోకర్ అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలు జోకర్ల అని కేసీఆర్ అనడం పట్ల అరవింద్ ఈ వ్యాఖ్యలు చేసారు. దేశంలో హిందువులను చంపడానికి ఉన్న పీఎఫ్ఐ సంస్థను కేసీఆర్ ప్రోత్సాహిస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవిత , ఫీనిక్స్ , బిల్డర్స్ స్కాంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారని అరవింద్ అన్నారు.

జైళ్ల శాఖ మంత్రి.. కేటీఆర్, కవిత కోసం జైలు సిద్ధం చేసుకోవాలి. నాలుగు రోజుల్లో కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం లో విచారణకు పిలుస్తారు. అదే రోజు అరెస్ట్ చేస్తారు. కేటీఆర్‌కు నార్కోటిక్ పరీక్ష చేయాలి. కేసీఆర్, కేటీఆర్ అవినీతి సొమ్ముకి సంబంధించిన కేసుల్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారు. దర్యాప్తు సంస్థలు పారదర్శకంగా పనిచేస్తాయి. బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయదు. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయగలిగేది కేటీఆర్ మాత్రమే. కవితను ఓడించడం, జైలుకు పంపడం వెనక కేటీఆరే ఉంటారు అని అరవింద్ అన్నారు.