మరో శ్రద్ధ తరహా ఘటన : భర్తను నరికి ముక్కలు చేసిన భార్య

ఢిల్లీ లో ప్రేమించిన శ్రద్దా అనే యువతిని హత్య చేసిన ఆమె ప్రియుడు హఫ్తాబ్ ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. హఫ్తాబ్ ను ఉరి తియ్యాలని అంత కోరుకుంటున్నారు. ఈ ఘటన ఇంకా మరవకముందే ఇదే తరహా మరొకటి చోటుచేసుకుంది.

ఈసారి భర్తను నరికి ముక్కలు చేసింది ఓ భార్య. ఈ ఘటన కూడా ఢిల్లీ లోనే చోటుచేసుకుంది. కన్నా కొడుకుతో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేసింది. భర్తను హత్య చేసి… శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచింది. రోజుకు కొన్ని చొప్పున శరీర భాగాలను గ్రౌండ్‌లో పడేసింది భార్య. ఈ తంతంగానికి కొడుకు కూడా సహకరించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడం తో వారిపై కేసు నమోదు చేసారు.