ధమాకా ”డు డు డు'” సాంగ్ చూసారా..?

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ధమాకా’ మూవీ నుండి డు..డు అంటూ సాగే సాంగ్‌ విడుదలైంది. ‘వీడు ఎగబడి తెగబడి కలబడి గెలిచే మాస్.. వాడు మనసును మెదడును పదునుగా విసిరే క్లాస్..’ అంటూ సాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. సినిమాలో రవితేజ క్యారక్టర్ ఏంటనేది ఈ పాటలో తెలియజెప్పే ప్రయత్నం చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ‘డు డు’ పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. గీత రచయిత సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి హీరో పాత్రని ఎలివేట్ చేసే లిరిక్స్ అందించారు. యువ గాయకుడు పృథ్వీ చంద్ర ఎంతో హుషారుగా ఈ పాట పాడారు.

త్రినాథరావు నక్కిన డైరెక్షన్లో రవితేజ , శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.