కాంతారా నిర్మాతలకు షాక్ ఇచ్చిన అమెజాన్

కాంతారా నిర్మాతలు హోంబెల్ ఫిలిమ్స్ వారికీ అమెజాన్ షాక్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటిటి ప్రేక్షకుల..ఎదురుచూపులు తెరపడింది. కాంతారా మూవీ గురువారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కన్నడలో సెప్టెంబరు 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బాస్టర్ హిట్‌ని అందుకుంది. దాంతో మిగిలిన భాషల్లో కూడా అక్టోబరు 15న రిలీజ్ చేశారు. అయితే.. ఊహించని విధంగా విడుదలైన అన్ని భాషల్లోనూ కాంతార రికార్డుల మోత మోగించేస్తూ ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా అన్ని భాషలు కలిపి 500 కోట్లు రాబట్టింది.

ఇక ఈ సినిమాలో హైలైట్ గా నిలిచిన ఘట్టం.. రిషబ్ శెట్టి భూతకోల ఆడే సీన్..ఈ సీన్ లో ‘వరాహ రూపం దైవ వరీష్టం..’ అంటూ సాగే పాత బ్యాగ్రౌండ్ లో వినిపిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తూ వుంటుంది. రీసెంట్ గా ఈ పాటపై వివాదం చెలరేగడంతో మేకర్స్ ఆ పాటని కట్ చేసి అమెజాన్ ప్రైమ్ వారికి ఇచ్చేశారు. ఇది ఇప్పడు ఓటీటీ వెర్షన్ లో లేకపోవడంతో ‘కాంతార’ అభిమానులు షాక్ కు గురవుతున్నారు. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ హోంబెల్ ఫిలిమ్స్ కు కోత విధించినట్లుగా తెలుస్తోంది. సినిమాలో అసలైన కంటెంట్ లేకపోవడంతో 25% వరకు ఓటీటీ డీల్ లో పేమెంట్ తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం పూర్తిస్థాయిలో కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి నిబంధనల ప్రకారం ఆ కోత విధించారు. అది కూడా కొంతవరకు గడువు మాత్రమే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆలోపు కోర్టు సమస్యలన్నీ తేల్చుకుని ముందుగా ఒప్పుకున్న డీల్ ప్రకారం సినిమా కంటెంట్ మొత్తాన్ని ఓటీడీకి ఇవ్వాలి అని వాళ్ళు హెచ్చరించినట్లు సమాచారం.