క్యాపిట‌ల్ హిల్ దాడి..విచారణను ‘కంగారూ కోర్టు’గా అభివర్ణించిన ట్రంప్

వాషింగ్ట‌న్‌: అమెరికా ప్ర‌జాప్ర‌తినిధుల క‌మిటీ క్యాపిట‌ల్ హిల్ దాడి ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే విచార‌ణ చేప‌డుతున్న ఆ బృందంపై మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ విమ‌ర్శ‌లు చేశారు. అది కంగారో కోర్టు అని ఆయ‌న ఆరోపించారు. అక్ర‌మ రీతిలో ఆ విచార‌ణ జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు. దీనిపై ట్రంప్ 12 పేజీల ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. డెమోక్ర‌టిక్ ప్ర‌భుత్వ విప‌త్తుల నుంచి అమెరిక‌న్ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ఈ విచార‌ణ కొన‌సాగిస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు.

మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ అధికారంలో కొన‌సాగేందుకు తిరుగుబాటుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు క‌మిటీన త‌న విచార‌ణ‌లో అభిప్రాయ‌ప‌డింది. సోమ‌వారం రెండ‌వ సారి ఆ ప్యానెల్ విచార‌ణ చేప‌ట్టింది. 2021 జ‌న‌వ‌రి ఆర‌వ తేదీన ట్రంప్ మ‌ద్ద‌తుదారులు క్యాపిట‌ల్ హిల్‌పై దాడి దిగిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుత అధ్య‌క్షుడుని బేస్మెంట్ బైడెన్ అంటూ ట్రంప్ ఆరోపించారు. 2024లో జ‌ర‌గ‌నున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో త‌న పోటీని అడ్డునేందుకే ఈ ఎంక్వైరీని ఏర్పాటు చేసిన‌ట్లు ట్రంప్ అన్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/