‘ధమాకా’లోని డిలీటెడ్ సీన్స్ ఇవే..

రవితేజ – నక్కిన త్రినాద్ కలయికలో వచ్చిన ధమాకా మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. క్రాక్ తర్వాత ఒక్క హిట్ కూడా లేక రవితేజ తో పాటు అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో ధమాకా వచ్చి బ్లాక్ బస్టర్ కావడం అందరిలో సంతోషం నింపింది. క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ..మొదటి ఆట తో హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 10 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా..అంతే వేగంగా రూ.100 కోట్ల జాబితాలో చేరింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి డిలీటెడ్ సీన్స్​ను చిత్రబృందం విడుదల చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా క్లీన్​గా ఉన్న ఈ సీన్స్​ అభిమానులను అలరిస్తున్నాయి. మీరు కూడా ఈ సీన్స్ ఫై లుక్ వెయ్యండి.

ప్రస్తుతం రవితేజ రావణాసుర మూవీ చేస్తున్నాడు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతుండగా.. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ 07 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video