దసరా సెలవుల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన దక్షిణ మధ్య రైల్వే

దసరా సెలవుల నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది దక్షిణ మధ్య రైల్వే . ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అందుబాటులో పలు రైళ్లను తీసుకొచ్చింది. ఆ వివరాలు చూస్తే.. సికింద్రాబాద్‌ నుంచి యశ్వంత్‌పూర్ (బుధవారం) వెళ్లే 07265 ట్రైన్ 21.45 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 10.50 గంటలకు చేరుకుంటుంది. 28-09-2022 తేదీన ఈ రైలు బయలుదేరుతుంది.

  • యశ్వంత్‌పూర్‌ నుంచి సికింద్రాబాద్‌ (గురువారం) వెళ్లే 07266 నెంబర్‌ రైలు 15.50 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 4.15 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. 29-09-2022 తేదీన ఈ రైలు బయలుదేరుతుంది.
  • తిరుపతి నుంచి సికింద్రాబాద్ (ఆదివారం) వెళ్లే 07481 నెంబర్‌ రైలు 21.10కి బయలు దేరి తర్వాతి రోజు 09.30 గంటలకు చేరుకుటుంది. 09-10-2022 తేదీన ఈ రైలు బయలు దేరుతుంది.
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతి (సోమవారం) వెళ్లే 07482 నెంబర్‌ రైలు 16.15 గంటలకు బయలు దేరి తర్వాతి రోజు 05.20కి గమ్యాన్ని చేరుకుంటుంది. 10-10-2022 తేదీన బయలుదేరుతుంది.
  • సికింద్రాబాద్‌- యశ్వంత్‌పూర్‌ – సికింద్రాబాద్‌ రైలు కాచిగూడ, ఉమాద్‌నగర్‌, షాద్‌ నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌ నగర్‌, వనపర్తి, గద్వాల్‌, కర్నూల్‌ సిటీ, ధోన్‌, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్‌, ఎలకం స్టేషన్‌లలో ఆగుతుంది.
  • ఇక తిరుపతి – సికింద్రాబాద్‌ – తిరుపతి రైలు రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్‌, మంత్రాలయం, రాయ్‌చూర్‌, తాండూర్‌, వికారాబాద్‌, లింగంపల్లి, బేగంపేట్‌ స్టేషన్స్‌లో ఆగుతుంది.