యాదాద్రిలో పోటెత్తిన భక్తులు

ఈరోజు ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. దీంతో ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతల నుంచి యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుండి స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి వేకువ జాము నుండే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పుడుతుంది. భక్తుల రద్దీని దృష్ట్యాలో ఉంచుకొని ఆలయంలో లఘు దర్శన సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.

ఇక ఒకప్పుడు యాదాద్రికి పెద్దగా భక్తులు వచ్చేవారు కాదు..సెలవు దినాల్లో కూడా వేలల్లో మాత్రమే ఉండేవారు. కానీ ఆలయ పున : నిర్మాణం తర్వాత తెలంగాణ నుండే కాదు పక్క రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ఆలయ అందాలను చూసి తరిస్తున్నారు. కేసీఆర్ ఎంతో చక్కగా నిర్మించారని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.