మూడో రోజు భారీగా పడిపోయిన లైగర్ కలెక్షన్స్

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రానికి ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ..ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది. కానీ మూడో రోజు భారీగా పడిపోయాయి. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేసారు. పూరి – విజయ్ దేవరకొండ కలయికలో సినిమా అనగానే అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి.

బాక్సింగ్ నేపథ్యంలో కథ..మైక్ టైసన్ నటించడం..పాన్ ఇండియా గా విడుదల కావడం తో అభిమానులు ఎన్నో ఆశలతో థియేటర్స్ కు వెళ్లారు. కానీ థియేటర్స్ కు వెళ్లిన అభిమానుల ఆశలపై పూరి నీళ్లు చల్లాడు. అసలు ఇది పూరి..విజయ్ తో చేయాల్సిన సినిమానేనా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పూరి సినిమా అంటే పంచ్ డైలాగ్స్ , హీరో క్యారెక్టర్, అదిరిపోయే క్లైమాక్స్ , హీరో – హీరోయిన్ లవ్ ట్రాక్ , కామెడీ ఇలా చాలానే ఎక్స్పెట్ చేస్తారు. కానీ లైగర్ లో మాత్రం అవేమి లేకపోవడం తో అభిమానులు బాగా నిరాశకులోనయ్యారు. ఇక సోషల్ మీడియా లో పూరి ఫై ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తూ ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఇక థియేటర్స్ కు వెళ్లే సాహసం చేయకపోవడం తో కలెక్షన్లు భారీగా పడిపోయాయి.

మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు చూస్తే..

నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 20 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 16 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 7 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రూ. 1.00 కోట్లు షేర్, రూ. 2.00 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది.

ఇక మూడు రోజుల్లో మొత్తం కలెక్షన్స్ చూస్తే..నైజాంలో రూ. 5.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.72 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.63 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 82 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 52 లక్షలు, గుంటూరులో రూ. 94 లక్షలు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 51 లక్షలతో.. రూ. 12.11 కోట్లు షేర్, రూ. 20.35 కోట్లు గ్రాస్ వసూలు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.26 కోట్లు షేర్‌, రూ. 42.50 కోట్లు గ్రాస్ వచ్చింది.