మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా పాజిటివ్

కన్నడలో ట్వీట్ చేసిన యడియూరప్ప


న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. ఆయనలో కోవిడ్ లక్షణాలు లేవని ఆయన కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పింది. నిన్న సాయంత్రం దేవెగౌడ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని ఈ ఉదయం రిపోర్టు వచ్చింది. మరోవైపు దేవెగౌడకు కరోనా సోకిందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా ధ్రువీకరించారు. దేవెగౌడ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన కన్నడలో ట్వీట్ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/