ఇప్పుడు ఆర్బీఐ కూడా అదే చెప్పిది

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న ఆర్బీఐ

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై భారీగానే ఉంటుందని ఆర్బీఐ తాజాగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్ మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా ఇదే విషయంపై తాను హెచ్చరిస్తున్నానని… తన వ్యాఖ్యలను ఇప్పుడు ఆర్బీఐ నిర్ధారించిందని చెప్పారు. ఆర్థికి పరిస్థితిని మెరుగుపరచాలంటే… ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఎక్కువ అప్పులు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. పేదలకు డబ్బు ఇవ్వాలని, పారిశ్రామికవేత్తలకు ఎక్కువ పన్నులు విధించరాదని సూచించారు. వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పారు. మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోవని అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/