NTR30 దేవర ఫస్ట్ లుక్ రిలీజ్

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30 వ చిత్ర టైటిల్ ను మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. తెలుగుతో పాటు తమిళ , కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ పోస్టర్ లో చేతిలో కత్తి ఒంటి నిండా రక్తంతో ఉన్న ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ఆర్ఆర్ఆర్ కంటే కొంచెం పొడవైన జుట్టుతో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. వెనుక పడవలో శవాల గుట్టను చూస్తేనే ఇది భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కనుందని అర్ధమవుతుంది.

ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నారు. సైఫ్ అలీఖాన్ సరసన ఈ సినిమాలో నటి చైత్ర రాయ్ కనిపించబోతుందట. అలాగే ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు.ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.