నాగచైతన్య-సమంత విడాకులపై స్పందించిన దేవకట్టా..

నాగ చైతన్య – సమంత లు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరి నుండి ఈ ప్రకటన రావడం తో అంత షాక్ అవుతూ స్పందించడం మొదలు పెట్టారు. చిత్ర సీమా నుండి కూడా పలువురు కామెంట్స్ చేశారు. తాజాగా వీరిద్దరిని జోడిగా పెట్టి ఆటో నగర్ సూర్య సినిమా ను డైరెక్ట్ చేసిన దేవాకట్టా..వీరి విడాకుల ఫై స్పందించారు.

“బంధం వర్కవుట్ కానప్పుడు.. బలవంతంగా, సమాజం కోసం నరకం అనుభవించడం కంటే, భర్త-భార్య అనే ట్యాగ్స్ ను వదిలించుకోవడమే బెటర్. భార్యాభర్తలు కాకముందు వాళ్లు మంచి ఫ్రెండ్స్. ఆ విషయం నాకు తెలుసు. ఫ్యామిలీ లైఫ్ వర్కవుట్ కానప్పుడు.. విడిపోయి ఎవరి దారులు వాళ్లు చూసుకొని, స్నేహితులిగా కొనసాగడం అనేది చాలా మంచి విషయం. అందులో తప్పు లేదు.” అని అన్నారు.

ఆటోనగర్ సూర్య టైమ్ లో సమంత-చైతూలు మంచి ఫ్రెండ్స్. చాలా మెచ్యూర్డ్ గా ఉండేవారు. ఆ టైమ్ లో వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని నేను అనుకోను. ఒకవేళ వాళ్లు నా సినిమా సెట్స్ లో ప్రేమలో పడినా, ఆ విషయం నాకు తెలియదు కదా. ఎందుకంటే, సెట్స్ లో అంతా ప్రొఫెషనల్ గానే ఉన్నారు. వాళ్లిద్దరి మధ్య లవ్ నడిచిన విషయాన్ని నేను అప్పట్లో గమనించలేదన్నారు.