ఈరోజు తో పూర్తి కానున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్లు..

హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్లు ఈరోజు తో ముగియనున్నాయి. ఈ క్రమంలో బిజెపి అభ్యర్థి బరిలో ఉన్న ఈటెల రాజేందర్ ఈరోజు నామినేషన్ వేయబోతున్నారు. ఈనెల 1 నుంచి 8 వరకు నామినేషన్లను గడువు ఉందని ఈసీ ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నేడు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈనెల 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. 13న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అక్టోబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 2న ఓట్లను లెక్కించనున్నారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీపడుతుండగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ (వెంకట నర్సింగరావు)ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఎన్నికల్లో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉంది.