నాగబాబు ను బ్రదర్ అంటూ మంచు విష్ణు సెటైర్లు

మా ఎలక్షన్స్ ఆర్టిస్ట్ ల మధ్య గొడవలు పెడుతున్నాయి. మొన్నటి వరకు చక్కగా మాట్లాడుకున్న వారు ఇప్పుడు మాటల , ప్రతి మాటలు చేసుకుంటూ విమర్శించుకుంటున్నారు. మొదటి నుండి మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధువారం నాగబాబు ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ..మా ఎలక్షన్స్ లలో ఫస్ట్ టైం ఓటు కు పది వేలు ఇస్తున్నట్లు విన్నానని విష్ణు ప్యానల్ ఫై ఆరోపణలు చేసారు. ఈ ఆరోపణల ఫై విష్ణు సెటైర్లు వేశారు.

బ్రదర్ నిజమే ఓటుకు 75వేలు ఇచ్చాను. కరెక్ట్ చేసుకోండి. నా కుటుంబ సభ్యులైన అక్క తమ్ముడు మా నాన్నకు కూడా డబ్బు ఇచ్చాను.. మహేష్ కి గూగుల్ పే చేశాను! ఓటు వేయకపోతే రిటన్ అడుగుతాను. నేను డబ్బు ఇచ్చిన వారంతా వెనక్కి ఇవ్వాలి.. అంటూ విష్ణు ఛమత్కారంగా మాట్లాడారు. అలాగే తన మేనిఫెస్టో విడుదల చేసారు. మా భవనాన్ని తన సొంత డబ్బు కడతానని హామీ ఇచ్చారు.. ఇప్పటికే మూడు స్థలాలు చూసామని… భవిష్యత్ అవసరాలు తీర్చేలా మా భవనం కడతామని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టో లో మొదటి ప్రాధాన్యత అవకాశాలైన మా ఆప్ రెడీ చేస్తామని.. జాబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.