మెగాస్టార్ ఫై మెగా అభిమానాన్ని చాటుకున్న డైరెక్టర్ మెహర్

బిల్లా ఫేమ్ మెహర్ రమేష్..మెగాస్టార్ చిరంజీవి ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈయన చిరంజీవి తో వేదాళం రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ఈ క్రమంలో మెహర్ రమేష్ మాట్లాడుతూ..చిరంజీవి ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

మొదటి నుంచి కూడా నేను చిరంజీవిగారి అభిమానినే. ఆయన సినిమాలను తప్పకుండా చూసేవాడిని. నా దృష్టిలో ఆయన సూపర్ హీరో. అలాంటి నాకు ఆయనతో సినిమా చేసే ఛాన్స్ రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అభిమానిగా మెగాస్టార్ ను ఎలా చూడాలనుకుంటానో, అలాగే ఆయనను తెరపై చూపించడానికి ట్రై చేస్తున్నాను” అన్నారు. “చిరంజీవిగారికి సహనం ఎక్కువ. ఏ విషయంలోను ఆయన తొందరపడి మాట్లాడరు. తనని తాను మలచుకుంటూ ఎదిగినవారాయన. నటన విషయంలోనే కాదు .. వ్యక్తిత్వం విషయంలోను ఆయన మెగాస్టారే. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నింగిలోని సూర్యుడు .. నేలపై హిమాలయం’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మెహర్ చేసిన కామెంట్స్ మెగా అభిమానులను ఫిదా చేస్తున్నాయి.