రేపు ఢిల్లీకి వెళ్లనున్న సిఎం జగన్‌

అమిత్‌ షా..మరికొంత మంది కేంద్ర మంత్రులతో భేటీ

CM Jagan
CM Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈసందర్భంగా జగన్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను అమిత్ షాతో జగన్ చర్చిస్తారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ప్రధానంగా ఆయన కేంద్ర మంత్రులతో ఆర్థిక అంశాలపైనే మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలు నష్టపోయిన వైనాన్ని ఆయన వివరించనున్నట్లు సమాచారం. కాగా లాక్‌డౌన్‌ తర్వాతసిఎం జగన్‌ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/