హైదరాబాద్‌లో 43 కిలోల గంజాయి పట్టివేత

హైదరాబాద్: హైదరాబాద్ లోని రాంజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని చింతల్‌మెట్‌ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న 43 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/