మనీలాండరింగ్ కేసు.. మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఇంటిపై ఈడీ దాడులు

Delhi Minister Raaj Kumar Anand’s house raided by ED in money laundering case

న్యూఢిల్లీ: ఢిల్లీ అధికార పార్టీ ఆప్‌ నేతలు, మంత్రుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్‌ విచారణకు ముందు ఆయన కేబినెట్‌లోని మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ ఇండ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీలోని 12 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నది.

దిగుమతులపై రూ.7 కోట్లకుపైగా కస్టమ్స్‌ ఎగవేత, హవాలా లావాదేవీలకు సంబంధించి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ ఫిర్యాదు ఆధారంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. పటేల్‌ నగర్‌ ఎమ్మెల్యే అయిన ఆనంద్ ప్రస్తుతం ఢిల్లీ సాంఘిక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తురన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో సీఎం కేజ్రీవాల్‌ గురువారం ఉదయం 11 గంటలకు ఈడీ విచారణకు హాజరుకానున్న విషయం తెలిసిందే.