నేడు ధర్మపురిలో సిఎం కెసిఆర్‌ బహిరంగ సభ

CM KCR Public Meeting

హైదరాబాద్‌ః నేడు ధర్మపురిలో సిఎం కెసిఆర్‌ బహిరంగ సభ జరగనుంది. మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ లో కెసిఆర్ ధర్మపురి చేరుకుంటారు. ఇప్పటికే మంత్రి కొప్పుల ఈశ్వర్ దగ్గర ఉండి ఏర్పాట్లు పూర్తి చేయించారు. నియోజకవర్గ పరిధి 6 మండలాల నుంచి 50 వేల మందిని సభకు తరలించేలా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. హెలిప్యాడ్, విఐపి పార్కింగ్ వద్ద నిగా పెట్టారు.

అలాగే.. నిర్మల్‌ జిల్లాలో జరిగే బహిరంగ సభల్లో కూడా ఈరోజు సిఎం కెసిఆర్‌ పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు బిఆర్‌ఎస్‌ నేతలు. ఇక అటు నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ ప్రసంగించారు. ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బిఆర్‌ఎస్‌ పార్టీయేనని ఈ సందర్భంగా కెసిఆర్‌ తెగేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ పార్టీ గెలువకుండా ఎవడూ ఆపలేడన్నారు. బిఆర్‌ఎస్‌ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదని చెప్పారు.