‘బంగార్రాజు’ నుంచి కృతి శెట్టి ఫస్ట్​లుక్ విడుదల

'బంగార్రాజు' నుంచి కృతి శెట్టి ఫస్ట్​లుక్ విడుదల

కింగ్ నాగార్జున , చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఇది సిక్వెల్ గా తెర‌కెక్క‌తుంది. ఈ చిత్రంలో నాగ్ “బంగార్రాజు” పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ క్రమంలో కృతి శెట్టి తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో కృతి నాగలక్ష్మి పాత్రలో కనిపిస్తుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ లో లంగావోణీలో చేతిలో కళ్ళద్దాలు పట్టుకొని కృతి బ్యూటిఫుల్ గా ఉంది. గ్రామ ప్రజలు మెడలో పూలమాల వేసి ఊరేగిస్తుండగా.. అందరికీ అభివాదం చేస్తూ కనిపిస్తోంది. మరి కృతి ఏమి సాధిస్తే జనాలు ఇలా ఆమెను మోస్తున్నారో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

‘బంగార్రాజు’ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.