చంద్రునిపైకి దూసుకెళ్లిన నాసా ఆర్టెమిస్-1

NASA’s Artemis 1 Launch Live Updates: Orion is now Moon-bound

న్యూయార్క్ః అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మూన్ మిషన్ ‘ఆర్టెమిస్-1’ ఈరోజు ప్రయోగించారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.17 గంటలకు రాకెట్ జాబిల్లి వైపు దూసుకెళ్లింది. ప్రయోగించిన కొన్ని నిమిషాల అనంతరం చంద్రుని వైపు ఓరియన్ అంతరిక్ష నౌకను రాకెట్‌ విడిచిపెట్టింది. సోమవారం నాటికి ఓరియన్ చంద్రుడి ఉపరితలం నుంచి 96.5 కిలోమీటర్లు దాటిపోతుంది. దాదాపు 25 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన అనంతరం డిసెంబర్ 11న పసిఫిక్ మహాసముద్రంలో పడనున్నది.

ఆర్టెమిస్‌-1 ప్రయోగం సాంకేతిక లోపాలు, వాతావరణ ప్రతికూలత కారణంగా గతంలో రెండు సార్లు ఆగస్ట్‌ 29, సెప్టెంబర్‌ 3న వాయిదా పడింది. మూడోసారి ప్రయోగం సందర్భంగా కూడా కొన్ని అవాంతరాలు తప్పలేదు. అయితే, వాటిని అధిగమించి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు నాసా తెలిపింది. రాకెట్‌లో హైడ్రోజన్‌ గ్యాస్‌ లీక్‌ అవుతుండగా శాస్త్రవేత్తలు సకాలంలో దాన్ని సరిచేశారు. కోర్‌ స్టేజ్‌లోని లిక్విడ్ హైడ్రోజన్‌, లిక్విడ్ ఆక్సిజన్‌ ట్యాంకులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ఇంధనాన్ని నింపడంతో నాసా శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకన్నారు.

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎస్‌ఎల్‌ఎస్‌.. ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ కోసం తయారు చేశారు. ఈ రాకెట్‌ను నాసా 1972 లో చంద్రుడిపైకి అపోలో మిషన్‌లో పంపింది. 50 ఏండ్ల తర్వాత నాసా తిరిగి మూన్‌ మిషన్‌ను ప్రారంభించింది. ఈసారి అంతరిక్ష నౌక ఓరియన్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు నాసా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ఎస్‌ఎల్‌ఎస్‌ను తయారు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/