బ్రహ్మమొక్కటే

Lord Brahma
Lord Brahma

మానవునికి కష్టసుఖాలలోను, సుఖదుఃఖాలలోనూ సుఖమే కావాలి. అన్నీ జీవితంలో వడ్డించిన విస్తరిలా ఉండాలి. శ్రమలేని ధన సంపాదన కృషి లేకుండా సుఖసంతోషాలు అన్నీ అమరినట్లు ఒనకూరాలి. దేవ్ఞణ్ణి దర్శిస్తే పూజిస్తే సర్వపాపాలు పాపాల మాటున దాగిన దుశ్చర్యలు ప్రక్షాళితం కావాలి. ఇదే దైనందిన జీవితంలో ఈ లోకంలో మానవ్ఞడు కోరుకునే కోరిక. మహర్షి రమణ భగవాన్‌ ఈ సందర్భంగా పురాణాల్లోంచి ఉటంకించిన బుభుని సంవాదం అన్న పేరిట గురుశిష్యుల కథ ఉదహరించారు. బుభు మహర్షి తన శిష్యుడైన నిదానమునకు పరబ్రహ్మమయిన పరతత్వము గురించి బోధ చేశాడు. గురుశిష్యులకు అపారమైన వాత్సత్యం ఉండేది. బుభువ్ఞ శిష్యుని సదామారువేషంలో అతని దినచర్యను గమనిస్తూనే ఉండేవాడు.

ఒకనాడు బుభువ్ఞ గ్రామీణుడి వేషంలో వెళ్లాడు. నిదాముడు రాజుగారి ఊరేగింపు వస్తూంటే కళ్లప్పగించి చూస్తూ నిలుచున్నాడు. నిదాముడు గురువ్ఞను గుర్తించలేదు. ఎవరో గ్రామీణుడని భావించాడు. బుభుబు నిదాముణ్ణి సమీపించి హడావ్ఞడిగా ఉందేమిటని ప్రశ్నించాడు. నిదాముడు రాజుగారి ఊరేగింపు వెళుతోందని సమాధానమిచ్చాడు. ఓహో! రాజుగారా? ఊరేగింపుగా వెళుతున్నారా? ఏదీ? బుభువ్ఞ అడిగాడు. అదిగో ఆ ఏనుగుపైన అని చెప్పాడు. అవ్ఞను నేను ఇరువ్ఞరినీ చూశాను. అయితే రాజు ఎవరు ఏనుగు ఏదీ? అని గ్రామీణుడు అడిగాడు. ఏమిటి? నీవ్ఞ ఇరువ్ఞనినీ చూస్తున్నావ్ఞ. దానిపైన ఉన్న మనిషి రాజు, కింద ఉన్న జంతువ్ఞ ఏనుగు అని తెలియదన్నమాట అన్నాడు నిదాముడు.

చిత్తం ఏదో తెలియనివాణ్ణి. కోపగించుకోవద్దు అని గ్రామీణుడు బ్రతిమాలుతూ మరలా అడిగాడు. నీవ్ఞ పైన అని క్రింద అనీ అన్నావే వాటికి అర్ధం ఏమిటి? నిదామునికి సహనం నశించింది. నీవ్ఞ రాజును చూస్తున్నావ్ఞ. ఏనుగును చూస్తున్నావ్ఞ. పైన రాజు, క్రింద ఏనుగు. కాని పైన క్రింద అంటే ఏమిటో తెలుసుకోవాలంటావ్ఞ? చూసిన దృశ్యం చెప్పిన మాట గ్రహించలేని నీకు ప్రత్యక్షంగా చేసి చూపిస్తేగాని బోధపడేట్లు లేదు. ఇలారా ముందుకు వంగు నీకంతా చక్కగా తెలుస్తుంది అన్నాడు. నిదాముడు అతని భుజాలపైకెక్కి ఇలా చెప్పాడు.

ఇదిగో ఇప్పుగు తెలుసుకో. నేను పైన రాజు లాగు ఉన్నాను. నీవ్ఞ కింద ఏనుగు లాగా ఉన్నావ్ఞ. ఇప్పుడు అర్ధమైందనుకుంటాను అన్నాడు. గ్రామీణుడు లేదు ఇంకా కాలేదు అన్నాడు. సరే రాజు ఏనుగు పైన కింద. ఇంత వరకు స్పష్టంగానే ఉంది. కాని ఏమనుకోక ఇది చెప్పు. నేను నీవ్ఞ అని వాటిని గురించి నీ ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించాడు గ్రామీణుడు.

ఉన్నట్లుండి ఈ విధంగా నేనును గురించి ఆ నేనుకు మారుగా నీవ్ఞ గురించి విడమరి చెప్పమంటుంది నా గురువ్ఞ బభువ్ఞ కాక మరెవరు ఉండరని నిదాముని మనసులో మెరుపు మెరిసింది. హే దయామయా! గురువరా! నీ కృపా భిక్ష అర్ధిస్తున్నాను. అంటూ క్రిందకు దూకి గురువ్ఞ పాదాలపై పడి వేడుకున్నాడు. కాబట్టి ఆత్మవిధానము ద్వారా భౌతిక జీవితమునందలి పైపై విషయాల్ని ఇప్పుడే ఇక్కడే అధిగమించడం నీ లక్ష్యం అయితే దేహముకు సంబంధించిన నీవ్ఞ నేను అనే బేధ దృష్టికి అవకాశం ఎక్కడ? అంతా తానే అయిన ఆత్మను వెదకు. ఆత్మగా ఉండు. అంటూ మహర్షి రమణ భగవాన్‌ సెలవిచ్చారు.

  • ఉలాపు బాలకేశవులు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/